Sunday, August 24, 2008

ఎంగేజ్మెంట్ వైభోగం

తమ్ముడు: అన్నయ్యా ఎంగేజ్మెంట్ అంటే ఏమిటి?

అన్న: అంటే పెళ్ళికి నిశ్చితార్ధం.

తమ్ముడు: మరి ఈ మధ్య పెళ్ళిళ్ళ కన్నా ఎంగేజ్మెంట్ లని ఎందుకు వైభోగంగా చేస్తున్నారు?

అన్న: డబ్బున్నవాళ్ళు అలా చేసుకుంటారు.

తమ్ముడు: కాదన్నయ్యా! ఈ మధ్య అందరూ ఎంగేజ్మెంట్ ఘనం గా చేసుకుంటున్నారు. international celebrities కూడా పెళ్లి కన్నా ఎంగేజ్మెంట్ కే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు.

అన్న: అయితే ఇప్పుడు ఏమి చేద్దాం?

తమ్ముడు: ఏమి చేస్తాం? అయినా ఏదో కారణం లేకుండా అలా చేయరు.

పది రోజుల తర్వాత...

తమ్ముడు: అన్నా కనుక్కున్నావా?

అన్న: ఏం kanukkovaali?
తమ్ముడు: అదే ఎంగేజ్మెంట్ ల గురించి.

అన్న: సరే పరిశోధన చేసి చెబుతా.

తమ్ముడు: తమ చిత్తం. సెలవు ఇప్పించండి.

అన్న: సెలవెందుకు?

తమ్ముడు: అదే నేను వెళ్తాను.

అన్న: సరే పో!

ఆరు రోజుల తర్వాత...

అన్న: వెంకటేశు ఈ మధ్య ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిలనే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడుట. అందుకే ఎటూ పెళ్లి గ్రాండ్ గా చేయలేము కదా! ఎంగేజ్మెంట్ అయినా గ్రాండ్ గా చేసి ఈ ముచ్చటైన తీర్చుకుందామని.

తమ్ముడు: అన్నగారి బుద్ధి కుశలతకి జోహార్లు.

అన్న: డమ్మీ - హార్డువేర్ ఇంజినీయర్ కి ఆశీస్సులు. ఇంక గవించేయ్.

వెంకటేశు అనగా సినిమాల్లో వెంకటేశు.

7 comments:

Purnima said...

oo..hoo.. didn't get it!

cbrao said...

తల్లి తండ్రులు తమ పిల్ల పెళ్లి వైభవంగా చెయ్యాలని ఆశిస్తారు. తమ పిల్లను, సినిమా వెంకటేష్ (బీద, పల్లెటూరి, చదువు తక్కువ వాడు) వైభవంగా పెళ్లి చేసుకోలేడు. ఉదాహరణకు చూడండి -నువ్వు నాకు నచ్చావ్ (2001) (వెంకటేష్, ఆరతి అగర్వాల్). పెళ్లి కి ముందు, తమకు నచ్చిన అబ్బాయితో ఎంగేజ్మెంట్ ఘనంగా చేస్తే, తమ ముచ్చటా తీరుతుంది. తరువాత వెంకటేష్ వచ్చి ఎలా పెళ్లిచేసుకొన్నా, తమ కోరిక అప్పటికే నెరవేరుతుంది కనుక ఎంగేజ్మెంట్ ఘనం గా చేస్తున్నారని, గీతచార్య ఉవాచ.

నాకు తెలిసి, నిశ్చయ తాంబూలాలకు మొగ పెళ్లి వారు ఏ అరడజను మందో వచ్చి, అమ్మాయి మెడలో ఏ నగో వేసి అమ్మాయి తమదనిపించుకొంటారు. వివాహ శుభలజ్ఞ పత్రికలు, పరస్పరం మార్చుకుంటారు. ప్రాంతాన్ని బట్టి కొద్ది మార్పులుండవచ్చు. కాని ఇప్పుడు జరుగుతున్న దేమిటి? ఈ మధ్య నేను కొన్ని ఎంగేజ్మెంట్ వేడుకలకు వెళ్లటం జరిగింది. జీలకర్ర-బెల్లం, మాంగల్యధారణ, సప్తపది తప్పించి పెళ్లిలో జరిగే అన్ని పనులూ, ఎంగేజ్మెంట్ వేడుకలో చేసి, దాదాపు వివాహమా అన్నంత హంగామాగా, వందల మంది అతిధుల సమక్షంలో, కాబోయే వధూ వరులు, ఉంగరాలు, దండలు మార్చుకుంటున్నారు. Marriage reception లా తంతు నడిపిస్తున్నారు. ఇహ ఛాయా చిత్రాలు, drinks, విందులూ సరే సరి. ఇవన్నీ అతే అనిపిస్తుంది, చూసే వారికి. ఏమి చెయ్యగలం? మారే కాలం తో పాటు మనమూ మారాలి అనుకుని సమాధానపడతాము.

క్రాంతి said...

బాగుంది సెటైర్ :)

గీతాచార్య said...

కాలంతో పాటూ మనం కూడా మారాలి. నిజమే. కానే ఆ అదనపు సొమ్ముని ఏ పేదలకైనా వాడితే బాగుంతుందికడా! ఏమంటారు రావు గారూ? కామెంటు కి ధన్యవాదాలు.

వైష్ణవి హరివల్లభ said...

ఆచార్యా! మీ సెటైర్ అదిరింది. ఇంతకీ ఎవరా అన్నా? ఎవరా తమ్ముడు? ఏంటి వాళ్ల కథ.

ప్రియ said...

బాగుంది మీ సమాధానం. వెంకటేశు బాగానే దొరికాడు. Good laugh.

Unknown said...

NICE CONVERSATION PLEASE DO WATCH AND SUBSCRIBE :https://goo.gl/8LbUVk