Wednesday, September 3, 2008

అనూష్క ఫాన్స్ క్లబ్!

తమ్ముడు: అన్నా! ఇదన్నాయం.

అన్న: ఏది రా?

తమ్ముడు: అదే హీరో లకి ఫాన్స్ క్లబ్బులు ఉండటం.

అన్న: దేనికి?

తమ్ముడు: ఎందుకా? నువ్వే ఆలోచించు. తెలుస్తున్ది. పెద్దలకి చెప్పగలిగే నాలెజ్ నాకు లేదు.

అన్న: సరే! నువ్వు పో! నివేదిక తెప్పిస్తాను. చదివి శాసనం జారీ చేస్తాను.

తమ్ముడు: ఆజ్ఞ!

అన్న: ఆశీస్సులు.

ఆరు రోజుల తర్వాత...

వేదిక మీద

అన్న: ఈ మధ్యో అన్నాయం అదే అన్యాయం నా దృష్టికి వచ్చింది. అదేంటంటే... హీరోయిన్ లకి ఎందుకు ఫాన్స్ క్లబ్బులు లేవు అని.

అందుకే నేనీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఏమయ్యా నరేష్! బలాదూర్ సినేమా రిపోర్ట్ ఏంటి?

నరేష్: ఫ్లాపు సర్.

అన్న: ఎమోయ్సతీష్! బలాదూర్ చూశావా?

సతీష్: చూశాను సర్.

తమ్ముడు: నేనూ వెళ్లాను సర్! చమించాలి అన్నయ్యా!

అన్న: దేనికి?

సతీష్: సూపెర్ స్టార్ కృష్ణ ఉన్నాడని.

అన్న: నిజం చెప్పు.

సతీష్: నేను రవితేజ ఫ్యాన్ ని.

అన్న: ఎండా పరండ ఎండా శాట. సత్యమేవ జయతే! అన్నది మన రాజ్యపు స్లోగన్. అది స్లోగన్ అయినా మనం ఫాస్ట్ గా ఉండాలి. నిజం చెప్పు! లేదా....?

సతీష్: అనూష్క బాగుందని రెండు సార్లు చూశాను.

అన్న: మరి రవితేజ ఫ్యాన్ అంటూ బ్యానర్ కట్టావ్?

సతీష్: అదీ... అదీ... అదీ...

అన్న: జనులారా! ఈ ద్రోహికి నేను రాజ్య బహిష్కార శిక్ష విధిస్తున్నాను.

జనం: అన్నా! మీరు చెప్పిందాన్ని మేము ఎదిరించం. కానీ మాకు కారణం చెప్పండి. మీరే రేషనల్ గా ఉండాలని అంటారు కదా!

అన్న: అవును. నాకు ఒక సహేతుకమైన కారణం ఉంది. వింటారా?

జనం: వింటాం. వింటాం.

తమ్ముడు: అన్నయ్యా! మీరు చెప్పండి. నేను రికార్డ్ చేయిస్తాను. టీవీ ఫైవ్, టీవీ టెన్, టీవీ ఎలెవెన్, ఈటీవీ, ఆటీవీ, ఓ టీవీ, టీవీ ఇన్ఫినిటీ, అందరూ వచ్చారా?

టీవోళ్ళు: వచ్చేశాం. కామేరాస్! స్టార్ట్ ఫోకస్.

అన్న: ఏమయ్యా!...

తమ్ముడు: ఏంటి అన్నయ్యా?

అన్న: నిన్ను కాదెహె!

తమ్ముడు: స్వారీ!

అన్న: వాకే!

జనులారా! ఏమిటీ అన్యాయం? ఏమిటీ అక్రమం? సినిమాలు చూసేది హీరోయిన్ ల కోసం. ఫాన్స్ క్లబ్బులు హీరోల కోసమా? ఏమన్యాయ మేమక్రమ మేమి దుండగీడు తనం? మీ కోసరం అనూష్క అంతగా అందాలనారబోస్తే గుట్ట చప్పుడు కాకుండా చూసేసి, ఫోటోలని నెట్టులో దాచీసుకుని, లొట్టలేస్తూ... చొంగ కారుస్తూ... చూసేసుకుని, ఫాన్స్ కాగితాలు మాత్రం హీరోలకా?

మీరు బట్టలిప్పారా? ఎక్స్పోజ్ చేశారా? వానలో తడిశారా? ఎందుకురా మీకోసం అనూష్క అందాలారబోయాలి? తను మీకు అంత చేస్తే మీరు ఒక కాగితంముక్క మాత్రం పెట్టలేరా తనకోసం? సాలె సినేమా ఫ్లాప్ అయి తను విషాదం లో ఉంటే మీరు ఈ విధం గా చేస్తారా?

ladies whistles వేశారు. ఐదునిమిషాల తర్వాత...

అన్న: ఇలియానా కోసం దేవదాసు చూసి
దేవదాసు అద్దిరిందంటారా? భలే దొంగలకి కొద్ది మందయినా వెళ్ళింది ఎవరి కోసం? చార్మీ, ఇలియానాల కోసరం కాదా? లేడీస్: అవునూ! అవునూ!

అన్న: మరలాంటిది ఆ సతీష్ అనూష్క కోసం సినేమా చూసి రవితేజకి బ్యానర్ కడుతాడా? అందుకే వీడికి దేశ బహిష్కార శిక్ష.

Ladies and Gentlemen: అవునూ అవునూ, అన్నా ఈశుభసందర్భంగా దేశ బహిష్కార శిక్ష విధించండి.

టీవోళ్ళు: అవునూ అవునూ!

అన్న: ఈ శుభ సందర్భంగా నేను సతీష్ లాటి వాళ్ళ కోసరం "అనూష్క ఫ్యాన్స్ క్లబ్" స్థాపిస్తున్నాను. దీనికి అధ్యక్షుడుగా మన డమ్మీ - హార్డువేరు ఇంజినీయర్ ని నియమిస్తున్నాను. ఎందుకంతే ఈ ప్రశ్నని లేవనెత్తి నన్ను ఆలొచింపచేసింది అతనే!

Ladies and Gentlemen: డమ్మీ - హార్డువేరు ఇంజినీయర్ గారికీ! జై.

జనం: అందరు హీరోయిన్లకీ ఫ్యాన్స్ క్లబ్బులు ఏర్పాటు చేయండి అన్నా!

అన్న: శాంక్షండ్.

జనం: "అన్న" గీతాచార్య గారికీ జై.





8 comments:

VIJAYABHASKAR said...

super.chaalaa baagundi..keep it up.....

Sujata M said...

సత్య వచనం చేసేరు. అసలు ఈ కసక్కు ల వల్లే సినిమాలు ఆ మాత్రమన్నా నడుస్తున్నాయి. సొంత చరిష్మా లేని హీరోలకు, ముసలి హీరోలకూ ఒక ఇద్దరు, ముగ్గురు కత్తి లాంటి అమ్మాయిల్ని హీరోయిన్లు గా తగిలించితే కదా - సినిమా చూడబుద్దవుతుంది ! అమ్మాయిల గ్లామర్ కనీసం 40 - 50 శాతం వ్యాపారాన్నిస్తాయి. ఎంత గ్లామరస్ అయితే అంత లాభం. హీరోయిన్లకూ తప్పకుండా ఉండే ఉంటాయి ఫాన్ క్లబ్ లు. తమిళ నాడు లో గుడులు కూడా వెలుస్తాయంట గా ! ఆంధ్రా లోనే హీరో ల హవా నడుస్తుంది. (మీరన్నట్టు - అదేంటో బయటకి.. కృష్ణ భగవాన్ కి ఫేన్ అని అయినా చెప్పుకుంటారేమొ గానీ, నేను ట్రిషా ఫేనూ అని ఎవరూ రొమ్ము విరుచుకు తిరగరు !)

Srividya said...

:) ... vishayam sootigaa cheppaaru.

Dreamer said...

వామ్మో వారయ్యో వార్నాయనో... ఎంత ముద్దుగా చెప్పావమ్మా నా డమ్మీ... అనూష్క ఫ్యాన్ క్లబ్ లో నన్నూ చేర్చుకోండి సార్.

ప్రియ said...

కత్తి లాంటి టపా. అద్దిరింది. చెణుకులూ, బెణుకులూ, ఆఁ... ఆఁ... ఏమన్నారూ!

"ఏమన్యాయ మేమక్రమ మేమి దుండగీడు తనం? మీ కోసరం అనూష్క అంతగా అందాలనారబోస్తే గుట్ట చప్పుడు కాకుండా చూసేసి, ఫోటోలని నెట్టులో దాచీసుకుని, లొట్టలేస్తూ... చొంగ కారుస్తూ... చూసేసుకుని, ఫాన్స్ కాగితాలు మాత్రం హీరోలకా?

మీరు బట్టలిప్పారా? ఎక్స్పోజ్ చేశారా? వానలో తడిశారా? ఎందుకురా మీకోసం అనూష్క అందాలారబోయాలి? తను మీకు అంత చేస్తే మీరు ఒక కాగితంముక్క మాత్రం పెట్టలేరా తనకోసం?"

నిజంగా మీరు ఈ విషయంలో మాస్తరేమో అనిపిస్తున్నది. మీ బ్లాగుల్లో వస్తు వైవిధ్యం ఎక్కువగా ఉంది. Kudos! :-)

నారు పోశారా? నీరు పోశారా? టైపులో... NTR స్టైల్ లో ఊహించుకుంటూ నవ్వుకోలేక చచ్చాను.

Kathi Mahesh Kumar said...

మజా వచ్చింది. నిజానికి ‘బలాదూర్’ సినిమా చెత్తగావుందని వార్తొచ్చినా నా మిత్రుడొకడు అనుష్కని చూద్దామని తీసుకెళ్ళాడు. "ఫ్యాన్స్" లేకపోయినా ఆరాధకులు మాత్రం అనుష్కకు దండిగానే వున్నారు.

Unknown said...

good information blogger.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel.

Unknown said...

NICE CONVERSATION PLEASE DO WATCH AND SUBSCRIBE :https://goo.gl/8LbUVk