Tuesday, August 12, 2008

హైదరాబాద్ లో మూడొందల సెంటీ మీటర్ల వాన!!

తమ్ముడు: పడితే ఎంత బాగుందో కదా? హి. హి.

అన్న: దేనికిరా?

తమ్ముడు: నువ్వే చెప్పావుగా అప్పుడు రాష్ట్రం అంతా హైదరాబాద్ లో పడ్డ నీళ్ళతో మునిగి పోతుందని.

అన్న: అవును.

తమ్ముడు: అనును కదా?

అన్న: ఐతే?

తమ్ముడు: అన్ని సిమిమాలూ ఒకలా ఉండవు.

అన్న: అబ్బ నీ సోది ఎంటిరా?

తమ్ముడు: నాన్నని ఎన్ని సార్లు అడిగినా నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించ మంటే చూపించట్లేదు. అందుకే హైదరాబాద్ లో మూడు వందల సెంటీ మీటర్ల వాన పడితే హైదరాబాద్ మునిగి పోతుంది ఇంచక్కా! అప్పుడు హాయిగా మన రాష్ట్రం అంతా మునిగి పోతుంది. అప్పుడు రాష్ట్రం అంతా ఒకే ఊరౌతుంది. అప్పుడు మనూరూ హైదరాబాదే కదా. నాన్న ని అడక్కుండానే చూడొచ్చు.

అన్న: ఓరి నీ అసాధ్యం కూలా! నీ కోసం హైదరాబాద్ కాదు కాదు రాష్ట్రం మొత్తం మునగాలా?

తమ్ముడు : మరి నేను చార్మినార్ చూడాలంటే నాన్న "నువ్వు చిన్న పిల్లాడివి. వేరే ఊరు ఒక్కడివే వేల్లలేవన్నాడు గా? ఇలా ఐతే అప్పుడు హైదరాబాద్ కూడా మనూరు అవుతుంది కదా? అప్పుడు నేనే వెళ్లి చూసి వస్తాను.

-------------------------------------------------------------------------------------------------

తమ్ముడు: అన్నయ్య ఇలాగే అంటాడు కానీ అంతా వాన పడితే ఇంచక్కా బోల్డు నీళ్లు. ఎంత హాయో! అప్పుడు కరంట్ కష్టాలుండవు. కదా! అవును కదా? ఒక్కల్లన్నా ఊఁ అనండి. ప్లీజ్. అప్పుడయితేనే నాన్న ఒప్పుకున్టాడేమో. ఏమిటో ఈలోకం లో ఎవరూ నన్ను అర్ధం చేసులోడం లేదు.


తమ్ముడు: అస్సలస్సలు నేను నా గురించి చేపటం మార్చే పోయాను కదా! "కత" విన్న వారికీ, దివిన వారికీ నా పేరు తెలుస్తుంది. అన్నయ్య నన్ను ముద్దుగా డమ్మీ అంటాడు. ఎందుకంటే తమ్ముడు కొడుతున్నా నేను ఏమీ చేయలేను కదా! వాడు తన్తుంటే నేను ముడుచుకు పోతుంటాను. వాడు కొట్టేందుకు అనుకూలం గా. ఎందుకంటే ఎవరికీ ఏది కావాలో అది ఇవ్వటం మంచి అలవాటని అమ్మ చెప్పింది కదా! అమ్మ మాట వినాలని నాన్న చెప్పాడు. నాన్న మాట వినాలని అన్నయ చెప్పాడు. అంతే కదా! అందుకే నన్నంతా డమ్మీ అంటారు.
నేను హార్డువేర్ ఎంజినీయర్ ఎలా అయ్యానంటారా? అన్నయ్య నా బుర్ర లో గట్టి పదార్ధం ఏమీ లేదంటాడు. గట్టి అంటే హార్డ్. లేదు కదా! "ఎక్కడుంది అది" అని అన్నయ్యని అడుగుదామనుకున్నాను. అందుటే నేను కష్ట పది ఇంగ్లీష్ నేర్చుకును "where" అన్నా. అంతే నండీ నా బుర్ర లో hard where? అంటూ పట్టుకుని నేను కనిపించినప్పుడల్లా hard where? hard where? అంటున్నారు.
సరే నాకు ఇంజినీయర్ కావాలని ఉంది. అందుకే నేను హార్డువేర్ ఇంజినీయర్. బాంది కదా! వాళ్లు నన్ను ఎక్కిరించినా నేను హార్డువేర్ ఇంజినీయర్ అయ్యాను.
అందుకే ఎవరన్నా నన్ను నీ పేరేంటి అంటే "డమ్మీ - హార్డువేర్ ఇంజినియర్" అంటున్నాను. అదీ కథ. మరి చార్మినార్ చూడాలన్న నా కోరిక తీరాలని దేవుడిని అడుగుతారా? అన్నయ్య నన్ను బ్లాగ్ వ్రాయమన్నాడు. అందుకే ముందు ఇది అడిగేశా మిమ్మల్ని.
టాటా.
డమ్మీ - హార్డువేర్ ఇంజినియర్

4 comments:

వైష్ణవి హరివల్లభ said...

"తమ్ముడు: నాన్నని ఎన్ని సార్లు అడిగినా నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించ మంటే చూపించట్లేదు. అందుకే హైదరాబాద్ లో మూడు వందల సెంటీ మీటర్ల వాన పడితే హైదరాబాద్ మునిగి పోతుంది ఇంచక్కా! అప్పుడు హాయిగా మన రాష్ట్రం అంతా మునిగి పోతుంది. అప్పుడు రాష్ట్రం అంతా ఒకే ఊరౌతుంది. అప్పుడు మనూరూ హైదరాబాదే కదా. నాన్న ని అడక్కుండానే చూడొచ్చు.

అన్న: ఓరి నీ అసాధ్యం కూలా! నీ కోసం హైదరాబాద్ కాదు కాదు రాష్ట్రం మొత్తం మునగాలా?"

ఓరి బాబోయ్! ఏమి కోరికండీ! కొత్త బ్లాగు బ్లాగుంది.

ప్రియ said...

కూల్. అంటే న్యూయార్క్ ని చూడాలంటే పసిఫిక్ పొంగాలా? :-ద

బాగుందీ అవతారం.

Unknown said...

ante

Unknown said...

NICE CONVERSATION PLEASE DO WATCH AND SUBSCRIBE :https://goo.gl/8LbUVk