తమ్ముడు: విగత జీవ కాదన్నయ్యా! వింత గత జీవి.
అన్న: పేరేంటో?
తమ్ముడు: వాయస యత్న.
అన్న: ఎక్కడో విన్నట్టుందే?
తమ్ముడు: 'వందో నంబరు కుర్రది' సినెమా చేయలా... వాడు.
vaayasa యత్న: బాల్రాజు బాబాయే సీయం.
అన్న: వీణ్ణి నీతో ఎందుకు తెచ్చావ్?
తమ్ముడు: మా బళ్ళో క్రొత్తగా చేరాడు. జనాన్ని తన్తుంటే తట్టుకోలేక అందరూ కల్సి బాదేశారు. చస్తాదేమో అని తీసుకొచ్చాను.
అన్న: మరి నిన్ను తన్నలా?
తమ్ముడు: మన 'అనూష్క ఫాన్స్ క్లబ్' జనం తోడుంటే నాకెందుకు భయం?
వాయస యత్న: బాలరాజు బాబాయే సీయం
అన్న: అమ్మా! ఇదా నీ ప్లాను.
తమ్ముడు:ఏంటన్నయ్యా నా ప్లాను?
అన్న: ఏదోక క్లబ్ కి నిన్ను ప్రెసిడెంట్ చేస్తే ఎవరూ రాకుండా చూసుకుంటారనే? అమ్మమ్మా! ఎంత నాటకం ఆడావ్.... ఆడ హీరోయిన్ లకి ఏదేదో అన్నాయం ఐపోతోందని?
తమ్ముడు: నా నిజాయితీని...
వాయస యత్న: బాల్రాజు బాబాయే సీయం.
తమ్ముడు: నువ్వాగెహే! శంకిస్తున్నావా?
అన్న: సర్లే! ఈ నమూనా గాడి సమస్య ఏంటి?
తమ్ముడు: ఈ మధ్య శంకరజీవి 'త్రిషా రాజ్యం' అనే పార్టీ పెట్టాడు కదా?
అన్న: ఎవరూ?..."
తమ్ముడు: మన 'మైక్రో స్టార్' శంకర జీవి.
అన్న: అవున్నిజమేరోయ్! నేను ఈ మధ్య బిజీగా ఉండటంతో ఆ పార్టీ గురించి వినలేదు. అసలు 'మైక్రో స్టార్' గురించే మర్చిపోయాను. సరే కానీ వీడి కథేంటో చెప్పు.
తమ్ముడు: అప్పటి నుంచీ వీడికి తిక్కెక్కిందిట. వీడూ ఏదొక పార్టీ పెట్టాలని ట్రై చేస్తే వద్దు అని వాళ్ల 'ఎవరో' సలహా ఇచ్చారట. నీ ప్రాధాన్యం పెర్గే పని చెయ్. అన్నారట. అందుకే అప్పటి నుంచీ ...
వాయస యత్న: బాలరాజు బాబాయే సీయం.
తమ్ముడు: అంటున్నాడు.
అన్న: వాయస యత్న గారూ! ఇంతకీ మీ ప్రయత్న ఏంటండీ?
వాయస యత్న: అన్నా! "నువ్వు నాకు నచ్చావ్!"
అన్న: సినేమా టైటిళ్ళొద్దు.
వాయస యత్న: సినేమా టైటిల్ కాదన్నగారూ! మీరు నాకు నచ్చారు అన్నా.
అన్న: అయ్యా! వాయస యత్న గారూ! మీరు నన్ను అంటే అన్న అనండి. అయినా తమ్ముడు కనుక తప్పక భరిస్తున్నాను కానీ నాకా మాటే నచ్చదు. దానికి తోడు, అన్నగారొకటి.
వాయస యత్న: బాల్రాజు బాబాయే సీయం.
తమ్ముడు: మనం మాట మధ్యలో ఖండిస్తే మళ్ళీ ఆ కూతే కూస్తాడు.
వాయస యత్న: రేయ్ నా కొడకా! కూతేంట్రా కూత?
అన్న: ఈ విగత జేవిని పట్టుకోండిరా! లేక పోతే మన డమ్మీ ని కరిచేట్టున్నాడు.
వాయస యత్న: నన్ను పట్టు కుంటార్రా!
అన్న: వదలొద్దు. వీణ్ణి...
వాయస యత్న: బాల్రాజు బాబాయే సీయం.
అన్న: ఎందుకురా డమ్మీ! వీణ్ణి అంటకట్టుకున్నావ్?
తమ్ముడు: మూదాఫు ఐపోతోందన్నయ్యా! నన్ను చమించు. తప్పు చేశాను. ఏదో జనం కుమ్మేస్తున్నారని పట్టుకొచ్చాను.
వాయస యత్న: నన్ను జనం కుమ్మేదేన్ట్రా? నేనే వాళ్ళను కుమ్ముతా. అసలు నేను తోడ గోడితే ఆంధ్రా అదురుతుంది. మా తమ్ముడు విజిలేస్తే ఆంధ్రా సాంబార్.
నరేష్: నీ బొంద! తమిళ్ సాంబార్. ఆంధ్రా సాంబార్ కాదు.
వాయస యత్న: బాల్రాజు బాబాయే సీయం.
తమ్ముడు: చస్తున్నాం బాబోయ్! వీడి మాటలని ఖండిచ వద్దు.
అన్న: ...
వాయస యత్న: అసలు మా వంశం గురించేమనుకున్టున్నారు? మా తాన్లోమూక్ వంశం మన తెలుగు వారి ఆత్మా గౌరవాన్ని నిలబెట్టింది. ఈ గడ్డ మీద మొదట 'అన్న' అనిపించుకుంది మాతాత. తొడ గొట్టింది మా తాత.
(రేపే ముగింపు)
Note: కేవలం హాస్యం కోసమే. అన్యధా భావించ వద్దు.